చిరంజీవి కోసం పూజలు చేస్తున్న మెగా అభిమానాలు !
Published on Nov 5, 2016 7:52 pm IST

khaidi-150-1
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తరువాత వెండి తెర మీదికి రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఇన్నాళ్ళు కాస్త స్తబ్దతతో ఉన్న చిరంజీవి అభిమానవుల్లో ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం బయటికొచ్చింది. ‘ఖైధీ నెం 150’ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి సినిమాకి సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. సినిమా ఎలాగైనా భారీ విజయం సాధించి చిరు పునరాగమనం దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు.

అలాగే తమ వంతు భాద్యతగా సినిమా విజయం కోసం అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిన్న శుక్రవారం అయినవిల్లి లోని గణపతి ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రావణం స్వామి నాయుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఏడిద శ్రీను తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దేశంలోని 6 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు చేస్తామని, సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని వారన్నారు. ఇకపోతే వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2017 జనవరిలో రిలీజ్ కానుంది.

 
Like us on Facebook