అభిమానుల అంచనాలను దాటిపోయిన మెగాస్టార్ !
Published on Dec 8, 2016 6:51 pm IST

khaidi-150-jpg
మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’ టీజర్ కొద్ధిసేపటి క్రితమే విడుదలైంది. సాయంత్రం 6 గంటల వరకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ వంటి సోషల్ సైట్ల ముందు ఆసక్తిగా ఎదురుచూస్తూ కూర్చున్న అభిమానులు టీజర్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియా మొత్తం ఖైధీ నెం 150 టీజర్, చిరంజీవి పేర్లను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక టీజర్ చూసి మెగాస్టార్ అనుకున్న, ఆశించిన దానికంటే ఎక్కువే చేశారంటూ పొంగిపోతున్నారు.

మొదట చిరు ‘కత్తి’ కథను ఎంచుకోగానే అది కుర్ర హీరోలు చేయాల్సిన సినిమా అని, చిరంజీవి ఈ వయసులో అంత యంగ్ గా కనిపించడం అసాధ్యమని, యాక్షన్ స్క్రిప్ట్ కాబట్టి ఎక్కువ కష్టపడాలని చాలా రకాల విమర్శలు గుప్పించారు. వాటన్నింటికీ సమాధానం అన్నట్టు ఉంది టీజర్. ముఖ్యంగా లుక్స్ పరంగా చూస్తే చిరు క్లోజప్ షాట్స్ లో సైతం యంగ్ గానే కనిపిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో, డైలాగ్ డెలివరీలో మునుపటి గ్రెస్ నే మైంటైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక టీజర్ చివర్లో ఇది నా స్వీట్ వార్నింగ్ అంటూ చెప్పిన డైలాగ్ అయితే అభిమానులను ఫుల్ ఖుషీ చేసింది. రామ్ చరణ్ నిర్మాతగా నిర్మించిన ఈ మొదటి చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

 
Like us on Facebook