మెగా మాస్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్

మెగా మాస్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్

Published on Dec 24, 2022 3:00 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వాల్తేరు వీరయ్య. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే టైటిల్ టీజర్ తో పాటు కీలక పాత్ర చేస్తున్న మాస్ మహారాజా రవితేజ టీజర్, బాస్ పార్టీ, శ్రీదేవి చిరంజీవి సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మెగా ఫ్యాన్స్ ని అలానే ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీకి ఆర్ధర్ ఏ విల్సన్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో పూనకాలు లోడింగ్ అనే మాస్ బీట్ సాంగ్ ని డైరెక్టర్ బాబీ అద్భుతంగా కంపోజ్ చేయించారట. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ స్టెప్స్ అదిరిపోతాయని, అలానే ఈ సాంగ్ కి దేవిశ్రీప్రసాద్ సూపర్ ట్యూన్ ని అందించారని టాలీవుడ్ బజ్. కాగా ఈ సాంగ్ ని అతి త్వరలో ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉందట వాల్తేరు వీరయ్య యూనిట్. మరోవైపు మెగా ఫ్యాన్స్ ఈ మెగా మాస్ సాంగ్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎప్పుడు పక్కాగా రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు