ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేసిన ‘ఖైదీ’ టీమ్!

25th, December 2016 - 01:45:51 PM

khaidi150-1
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘ఖైదీ నెం. 150’ కోసం అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ఒక్కోటిగా విడుదలవుతోన్న పాటలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఆడియో నేడు మార్కెట్లోకి వచ్చేస్తుందని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన టీమ్, తాజాగా ఆ విషయమై ఏ అప్‌డేట్ ఇవ్వకపోవడం అభిమానులను అయోమయంలో పడేసింది.

క్రిస్‌మస్ కానుకగా నేడు ఆడియో విడుదలవుతుందని ఎంతగానో ఎదురుచూస్తోన్న అభిమానుల్లో మరింత అయోమయం నింపుతూ, ఇటు ఖైదీ టీమ్ కానీ, లహరి మ్యూజిక్ కానీ ఏ అప్‌డేట్ ఇవ్వలేదు. జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోనున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోన్న విషయం తెలిసిందే. చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు.