కళ్యాణ్ రామ్ కి మెగా హీరో స్పెషల్ విషెస్…”బింబిసార” ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 5, 2022 5:39 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, మల్లిది వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ బింబిసార. నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ మేరకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ రామ్ అన్న, బింబిసార ట్రైలర్ నచ్చింది. ఇంటెన్స్, రా, కొత్తగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఇలాంటి ఎన్నో సక్సస్ ఫుల్ ఇయర్స్ రావాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు మెగా హీరో. వశిష్ట పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై హారి కృష్ణ కే నిర్మిస్తున్న ఈ చిత్రం లో కేథరిన్ థెరిస్సా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండగా, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 5, 2022 న విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :