మరో రెండు కొత్త సినిమాల్ని మొదలుపెట్టనున్న మెగా హీరో

saidharamtej
యంగ్ హీరోల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈ ఏడాది ఇప్పటికే ‘సుప్రీం, తిక్క’ వంటి చిత్రాలతో బాక్సాఫీసును పలకరించిన తేజ్ త్వరలో మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. ఇందులో ఒకటి కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ కాగా మరొకటి గోపిచంద్ మల్లినేని డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం.

తేజ్ ఈ నెల 19 నుండి నక్షత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడీ మెగా హీరో. దీని తరువాత ఇదే నెల 25 నుండి మల్లినేని చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు హాజరవుతాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకూ మాస్ హీరోగానే కనిపించిన తేజ్ ఈ చిత్రంలో ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఈ లుక్ కోసం తేజ్ ముంబై వెళ్లి మేకోవర్ చేయించుకున్నాడని, దర్శకుడు గోపీచంద్ మల్లినేని తేజ్ పాత్రను చాలా డిఫరెంట్ గా రూపొందించారని తెలుస్తోంది.