యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో మెగా హీరో !

28th, September 2017 - 03:17:29 PM

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న హైదరాబాద్లో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ప్రస్తుత్రం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. ఇప్పటికే ధరమ్ తేజ్ పై కొన్ని కీలక సన్నివేశాలను, యాక్షన్ సీన్లను చిత్రీకరించారట వినాయక్. ఇంకొద్దిరోజులపాటు ఈ షెడ్యూల్ ఇలానే కొనసాగుతుందట.

ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తేజ్ కెరీర్లోనే సెన్సేషనల్ సినిమా అవుతుందని, తమ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ భారీ హిట్ గా నిలుస్తుందని నిర్మాత సి.కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం వంటి పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.