అరకులో మెగా హీరో సందడి..!

8th, December 2016 - 09:26:31 AM

sai-dhram-tej
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఒక్కో సినిమాతో తన స్థాయి పెంచుకుంటూ వెళుతున్నారు. ‘సుప్రీమ్’ సినిమాతో సాయిధరమ్ తేజ్ మార్కెట్ స్థాయి చాలా పెరిగింది. ఆ సినిమా తర్వాత వచ్చిన ‘తిక్క’ భారీ ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. దీంతో సాయిధరమ్ తేజ్ స్టార్ హీరో రేసులోకి వచ్చేసినట్లు చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలతో కెరీర్ మొదట్లోనే వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకునేలా సాయిధరమ్ తేజ్ కూడా తన స్టైల్ కమర్షియల్ సినిమాలనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన చేస్తోన్న ‘విన్నర్’ భారీ బడ్జెట్‌తో, అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోందట. ఇప్పటికే యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుపుకుంటోంది. అరకులో ప్రస్తుతం చాలా చలి ఉన్నా కూడా తెల్లవారుజామున పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమా వేసవి సీజన్ మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.