టీజర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న మెగా హీరో మూవీ ?

టీజర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న మెగా హీరో మూవీ ?

Published on Nov 30, 2022 9:36 PM IST

సాయి ధరమ్ తేజ్ గత ఏడాది రిపబ్లిక్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీగా రూపొందిన దీనిని దేవ కట్టా తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న రిపబ్లిక్ తరువాత ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తేజ్ ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా అందాల నటి సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ డిసెంబర్ 7 న రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ కెరీర్ 15వ మూవీగా తెరకెక్కుతుండగా త్వరలో టైటిల్ సహా ఇతర వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారట యూనిట్ సభ్యులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు