ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ గాయపడ్డ మెగా హీరో !

varun-tej
మెగా హీరో, నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘మిస్టర్’ చిత్రంలో తేజ్ నటిసున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ ఘాటింగ్ లో భాగంగా హీరో వరుణ్ తేజ్ ఓ ప్రమాదకరమైన స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడ్డారు. దీంతో ఆయన్ను దగ్గర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు.

అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఆయనకు అయింది చిన్నపాటి గాయమేనని(బెణుకు లాంటిది), కంగారు పడాల్సిందేమీ లేదని, మూడు వారాల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని సూచించారు. దీంతో ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాల షూటింగ్ కాస్త మరో మూడు వారాల పాటు వాయిదా పడినట్లేనని అంతా అనుకున్నారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం డాక్టర్ల మాట కాదని సషూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇకపోతే ఈ షెడ్యూల్ రేపటితో పూర్తవుతుంది.

Exit mobile version