“వినరో భాగ్యము విష్ణు కథ” ట్రైలర్ ను లాంచ్ చేయనున్న మెగా హీరో!

Published on Feb 6, 2023 11:33 am IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం రాబోయే సినిమా వినరో భాగ్యము విష్ణు కథ ఫిబ్రవరి 17, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి కథానాయికగా నటించింది. రేపు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. తాజా వార్త ఏమిటంటే, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో సాయంత్రం 05:04 గంటలకు విడుదల చేయనున్నారు.

వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర యూనిట్ ఇదే విషయాన్ని ప్రకటించడానికి ప్రత్యేక వీడియో ను విడుదల చేసింది. మురళీ శర్మ, ప్రవీణ్, ఆమని, శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :