చిరంజీవి పాటను రీమిక్స్ చెయ్యనున్న మెగా హీరో !

‘జవాన్’ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాకు వినాయక్దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. ధర్మా భాయ్, ఇంటిలిజెంట్ అనే టైటిల్స్ ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నాయి.

తాజా సమాచారం మేరకు చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమాలోని చమకు చమకు ఛామ్ అనే పాటను రీమిక్ చెయ్యబోతునట్లు తెలుస్తోంది. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఆకుల శివ కథ మాటలు అందించారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ విజయం సాధించాలని కోరుకుందాం.