రానాతో నటించబోతున్న మెగా హీరో !

1st, January 2018 - 12:35:36 PM

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా ప్రస్తుతం ‘1945’ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ హీరో ‘హతి మేరే సాతి’ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది.

ప్రముఖ తమిళ డైరెక్టర్ సాల్మన్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. మెగా వరుణ్ తేజ్ ఈ సినిమా లో సెకండ్ హీరోగా నటించబోతున్నాడు. అయితే ఈ విషయంపై తఇంకా ధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలో ఈ సినిమా ప్రారంభంకానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వరుణ్ తేజ్ ,రానా కలిసి నటించబోతుండడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.