సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మెగా హీరో !

మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ‘వినాయక్’ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ఇంటెలిజెంట్’ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోందని చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించారు. ఆకుల శివ కథ మాటలు అందించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు.

రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మంచి విజయం సాధించబోతుందని తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.