మెగా అభిమానులకు ఫస్ట్‌లుక్స్ పండగ!

pawan-chiru
దీపావళి అంటే అందరికీ పెద్ద పండగ. వెలుగుల పండగైన ఈ దీపావళి వేళ కొత్త సినిమాలు థియేటర్లలో కళకళలాడడం సాధారణమే! అదేవిధంగా ఇప్పటికి సెట్స్‌పై ఉన్న సినిమాలు ఫస్ట్‌లుక్స్, టీజర్స్‌తో సందడి చేయడం కూడా సాధారణంగా జరుగుతుంది. ఇక ఈ దీపావళికి మెగా ఫ్యామిలీ నుంచి రెండు అదిరిపోయే లుక్స్ వచ్చి అభిమానులకు దీపావళి పండుగను రెట్టింపు చేశాయి. మధ్యాహ్నం ఖైదీ నెం. 150లో చిరు లుక్‌తో మొదలైన ఈ మెగా హీరోల ఫస్ట్‌లుక్స్ సందడి కాటమరాయుడుతో తారాస్థాయికి చేరింది.

‘ఖైదీ నెం. 150’లో వింటేజ్ స్టైల్ చిరంజీవి అదరగొడితే, ‘కాటమరాయుడు’లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్‌లు కలిసి ఉన్న దీపావళి స్పెషల్ లుక్ చాలా కూల్‌గా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఈ రెండు పోస్టర్లూ నిన్నంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చాయి. స్ట్రైట్ తెలుగు సినిమాలేవీ విడుదల కాని దీపావళి రోజున ఈ లుక్సే అభిమానులకు పండగను తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు.