పొంగల్ కి మెగా హీరోల క్లాష్ … నిజమెంతంటే ?

Published on Jul 5, 2022 11:00 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ తో చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీని ఏ ఎం రత్నం మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు. త్వరలో లేటెస్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని రిలీజ్ చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరోవైపు శంకర్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కూడా రాబోయే సంక్రాంతికి విడుదల కానుందని కొన్ని మీడియా మాధ్యమాల్లో ఇటీవల వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే చరణ్, శంకర్ ల మూవీ సంక్రాంతికి కాకుండా పక్కాగా సమ్మర్ కి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఇటీవల తమ బ్యానర్ నుండి ఇలయతలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తీస్తున్న వారసుడు మూవీ ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేయడంతో చరణ్ మూవీని సమ్మర్ కి తీసుకురానున్నారట దిల్ రాజు. సో, దీనిని బట్టి సంక్రాంతికి మెగా హీరోల క్లాష్ లేనట్లే అని, అలానే ప్రస్తుతం ప్రచారం అవుతున్నవన్నీ పుకార్లే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :