వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘తొలిప్రేమ’. ఔట్ అండ్ ఔట్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యొక్క టీజర్, పాటలు పేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ముందు టీమ్ ప్రకటించిన ప్రకారం ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా చిత్ర టీమ్ సినిమాను ఫిబ్రవరి 10 కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా రాశీఖన్నా నటిస్తోంది. ఎక్కువ శాతం ఫారిన్లో షూట్ జరుపుకున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, హైపర్ ఆది వంటివారు కూడా నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను బి.వి.ఎస్.ఎం ప్రసాద్ నిర్మించారు.
