పట్టాలెక్కనున్న మెగాహీరో కొత్త చిత్రం !


మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ‘జవాన్’ జనవరి 30న ఎన్టీఆర్ చేతుల మీదుగా లాంచ్ అయినా విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ రవి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 29 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. చిత్రం యొక్క షూటింగ్ మొత్తం దాదాపు హైదరాబాద్లోనే జరగనుంది. కేవలం రెండు పాటల కోసం మాత్రం విదేశాలకు వెళ్లనున్నారు టీమ్.

గత చిత్రం ‘విన్నర్’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ముందు సత్తా చూపకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు ధరమ్ తేజ్. బివిఎస్ఎస్ రవి కూడా ధరమ్ తేజ్ ఎనర్జీ లెవెల్స్ కు తగ్గట్టే కథను తయారు చేశానని, దేశమా, కుటుంబమా అనే సంక్లిష్ట పరిస్థితుల నడుమ నడిచే కథని గతంలోనే తెలిపారు. తమిళ నటుడు ప్రసన్న ప్రతి నానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో తేజ్ కు జంటగా మెహ్రీన్ కౌర్ ప్రిజాదా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.