కృష్ణవంశీ సినిమాలో మెగాహీరో కీ రోల్!

7th, August 2016 - 05:59:14 PM

krishna-vamsi-sai-dharam-te
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనదైన విలక్షణతను చాటుకొని టాప్ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ, తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ‘నక్షత్రం’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదుగుతోన్న సాయిధరమ్ తేజ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. పోలీస్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కొద్దిసేపు కనిపిస్తారట.

ఇక తన సినిమాలో ఈ పాత్రకోసం అడగ్గానే ఓకే చెప్పిన సాయిధరమ్ తేజ్‌కి థ్యాంక్స్ తెలుపుతూ, త్వరలోనే ఆయన షూట్‌లో పాల్గొంటారని కృష్ణవంశీ స్పష్టం చేశారు. శ్రీచక్ర మీడియా నిర్మిస్తోన్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కృష్ణవంశీ మార్క్ పోలీస్ డ్రామాగా సాగుతూనే కమర్షియల్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. దసరా సీజన్‌కు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.