మెగాస్టార్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి మెగా గిఫ్ట్ రెడీ ….?

మెగాస్టార్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి మెగా గిఫ్ట్ రెడీ ….?

Published on Aug 14, 2022 2:00 AM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలతో కెరీర్ పరంగా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మంచి క్రేజీ కాంబినేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీస్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ నెల 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా గతంలో ఆయన నటించిన భారీ ఇండస్ట్రీ హిట్ మూవీ ఘరానామొగుడు ని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దీనికి సంబంధించి పనులు ప్రారంభం అయ్యాయని, త్వరలోనే ఈ మెగా మూవీ యొక్క స్పెషల్ షోస్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. నగ్మా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వాణివిశ్వనాథ్ ఒక కీలక రోల్ చేయగా, ఇతర పాత్రల్లో రావుగోపాలవారు, సత్యనారాయణ, బ్రహ్మానందం, శరత్ సక్సేనా తదితరులు నటించారు. 1992లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి హీరోగా మెగాస్టార్ కి మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు