మెగా మాస్ “చిరు 154” నుంచి ఊహించని రిలీజ్ అనౌన్సమెంట్.!

Published on Jun 24, 2022 11:14 am IST


టాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి నుంచి అభిమానులు అయితే సాలిడ్ కం బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అది ఏ సినిమాతో ఇప్పుడు వస్తుందో కానీ ప్రస్తుతానికి అయితే చిరు చేస్తున్న అన్ని సినిమాలపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అయితే వీటిలో దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తో చేస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాపై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అంటూ ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చారు.

మెగా మాస్ అప్డేట్ అంటూ టీజ్ చేసిన ఈ అప్డేట్ అయితే ఇప్పుడు రివీల్ అయ్యిపోయింది. ఇది మాత్రం ఊహించనిది అని చెప్పాలి. ఈ మెగా మాస్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి సంసిద్ధం అవుతుంది అని ఈ క్రేజీ అప్డేట్ అయితే ఇప్పుడు మేకర్స్ ఇచ్చేసారు.దీనితో మాత్రం మెగా మాస్ పూనకాలు గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :