వైరల్ : “వాల్తేరు వీరయ్య” సెట్స్ నుంచి మెగా మాస్ ఫ్రేమ్.!

Published on Feb 8, 2023 11:00 am IST

టాలీవుడ్ లో లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా వచ్చి భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో మెగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ లతో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదిలో మొదటి బిగ్గెస్ట్ హిట్ కాగా ఇప్పటికీ సాలిడ్ రన్ ని అయితే ఈ చిత్రం కొనసాగిస్తోంది. ఇక ఇదిలా ఉండగా సినిమా సెట్స్ నుంచి లేటెస్ట్ గా మెగాస్టార్ మరియు మాస్ మహారాజ్ పై ఓ మెగా మాస్ ఫ్రేమ్ అయితే ఇపుడు బయటకి వచ్చింది.

సినిమాలో కీలక సన్నివేశం మధ్యలో చిరు మరియు రవితేజ లు చేతిలో చెయ్యి పట్టుకొని పర్ఫెక్ట్ బ్రదర్స్ తో వెనుక తమ క్యాప్టెన్ దర్శకుడు బాబీ కనిపిస్తున్నాడు. దీనితో ఈ పోస్ట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారగా చిరు మరియు రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అయితే శృతి హాసన్ మరియు క్యాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :