మెగా మాస్ మల్టీస్టారర్ “ఆచార్య”కి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Published on Apr 22, 2022 1:00 pm IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో కీలక పాత్రలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ చేసిన మెగా మాస్ మల్టీస్టారర్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొన్న ఈ సినిమా పై ఇప్పుడు ఒక్కో అప్డేట్ మంచి బజ్ ని తీసుకొస్తుంది.

ఈరోజు ఉదయమే సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ చెయ్యగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. మరి ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికేట్ ని ఇచ్చినట్టుగా తెలిపారు.

దీనితో ఈ సినిమా గ్రాండ్ గా ఈ ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక ఆ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :