మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్!?

kalyan-ram-sai-dharam-tej
నందమూరి కుటుంబం, మెగాస్టార్ కుటుంబం నుంచి తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది స్టార్సే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు కుటుంబాల నుంచి స్టార్స్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేసిన దాఖలాలు లేవు. ఎప్పట్నుంచో ఈ కాంబినేషన్ కుదురుతుందని, మెగా, నందమూరి మల్టీస్టారర్ ఉంటుందని ప్రచారం జరిగినా చివరికవి అక్కడే ఆగిపోయాయి. ఇక ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్ ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది. అదే కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్.

ఎవరికివారే హీరోలుగా స్టార్ స్టేటస్ సంపాదించుకొని దూసుకెళ్తోన్న ఈ ఇద్దరూ, త్వరలోనే ఏ.ఎస్.రవికుమార్ చౌదరి తెరకెక్కించే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ స్వయంగా సాయిధరమ్ తేజ్ పేరును సూచించినట్లు సమాచారం. ఇక ఇద్దరూ ఓకే చెప్పారని తెలుస్తూ ఉండడంతో మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్ తెరపై ఆవిష్కృతమయ్యేందుకు ఎంతోకాలం పట్టదని ఆశించొచ్చు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.