కమల్ “విక్రమ్” తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్!

Published on May 20, 2022 2:00 pm IST

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ జూన్ 3 న విడుదల కానుంది. కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా, నితిన్ యొక్క శ్రేష్ట్ మూవీస్ దీనిని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ జోరుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది మరియు అందులో భాగంగా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఫాహద్ మరియు విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు మరియు సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నారు.

కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ మరియు శివాని నారాయణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్, నిర్మాతలు కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :