వైరల్ పిక్స్ : ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు తో మెగాపవర్ స్టార్

వైరల్ పిక్స్ : ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు తో మెగాపవర్ స్టార్

Published on Dec 5, 2022 7:59 PM IST

టాలీవుడ్ యంగ్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి దానితో గ్లోబల్ గా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కోలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తో ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. అలానే మరోవైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో పాటు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వంటి వాటి ద్వారా తనవంతుగా మొదటి నుండి పలు సామజిక సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేపడుతూ ఎందరో యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎన్ డి టివి వారి నుండి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా, ట్రూ లెజెండ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఇంతటి అత్యున్నత అవార్డు ఆయనకు దక్కడంతో మెగాస్టార్ చిరంజీవి తోపాటు పలువురు ప్రముఖులు, సినీ ప్రేక్షకాభిమానులు రామ్ చరణ్ పై ప్రసంశలు కురిపించారు. అయితే ఆ అవార్డుని స్వీకరించిన రామ్ చరణ్ దానిని తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి అంకితం ఇస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. కాగా ఆ అవార్డు తీసుకున్న సమయంలో స్టైలిష్ సూట్ వేసుకున్న లుక్ లో ఉన్న రామ్ చరణ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు