లేటెస్ట్ : త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న మెగా ప్రిన్స్

Published on Feb 1, 2023 1:30 am IST

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం యువ హీరోగా మంచి క్రేజ్ తో పలు సక్సెస్ లతో దూసుకెళ్తున్న వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. తొలిసారిగా టాలీవుడ్ కి ముకుందా మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ దానితో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆ తరువాత సెకండ్ మూవీ కంచె తో నటుడిగా మరింత బాగా పేరు దక్కించుకున్న వరుణ్ ఇటీవల మరింత సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా వరుణ్ తేజ్ తండ్రి మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ, గత కొన్నాళ్లుగా వరుణ్ పెళ్లి గురించిన ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే స్వయంగా వరుణ్ తన పెళ్లి పై అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలిపేరు. ఇక ఆ న్యూస్ తో ఒక్కసారిగా మెగాఫ్యాన్స్ లో అమితానందం వెల్లివిరుస్తోంది. మరి వరుణ్ తేజ్ ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్తారో, అలానే ఆయనని పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున తో పాటు మరొక మూవీ కూడా వరుణ్ తేజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :