క్రేజీ బజ్ : అల్లు అర్జున్ ‘పుష్ప – 2’ లో మెగా ప్రిన్సెస్ ?

Published on May 6, 2023 1:05 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 (ది రూల్) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ పాన్ ఇండియన్ మూవీని గ్రాండ్ లెవెల్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీలో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఒక కీలక రోల్ చేస్తున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై పుష్ప 2 టీమ్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో సునీల్, రావు రమేష్, ధనుంజయ, అనసూయ భరద్వాజ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :