ఆ స్టార్ హీరోల కాంబో మూవీస్ కోసం వెయిటింగ్ అంటున్న మెగా ప్రొడ్యూసర్ …. !

Published on Jul 27, 2022 11:00 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్, యంగ్ స్టార్ హీరో అఖిల్ అక్కినేనితో ఏజెంట్ మూవీస్ నిర్మిస్తున్నారు అనిల్ సుంకర. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో అనిల్ ఈ రెండు మూవీస్ నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల మీడియాతో అనిల్ మాట్లాడుతూ, తమ బ్యానర్ నుండి రానున్న ఈ రెండు సినిమాల విజయాల పై మంచి నమ్మకం ఉందని, భోళా శంకర్ మూవీని మెహర్ రమేష్, ఏజెంట్ మూవీని సురేందర్ రెడ్డి ఎంతో అద్భుతంగా తీస్తున్నారని అన్నారు.

అలానే సూపర్ స్టార్ మహేష్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అనిల్ సుంకర, తనకు టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్ మూవీ కాంబినేషన్స్ అంటే ఎంతో ఇష్టం అన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి, అలానే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్స్ లో మూవీస్ వస్తే అద్భుతంగా ఉంటుందని, అలానే ఆ మూవీస్ లో సూపర్ స్టార్ మహేష్ సర్ప్రైజింగ్ గా ఒక క్యామియో రోల్ చేస్తే మరింత సూపర్ గా ఉంటుందని అన్నారు. ఇండస్ట్రీలో తనతో పాటు దాదాపుగా అందరు నిర్మాతలు ఈ తరహా మల్టీస్టారర్ ప్రాజక్ట్స్ చేయడానికి ఎప్పుడూ సిద్ధం అని, అయితే ఆయా స్టార్ హీరోల కాంబోలో సినిమాలకు సంబంధించి దర్శకుల నుండి కథలు సిద్ధం కావాలని, తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి సినిమాలు ఎక్కువగా రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు అనిల్ సుంకర.

సంబంధిత సమాచారం :