మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’లో సీనియర్ హీరోయిన్ !

Published on Sep 21, 2021 7:21 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ కుష్బూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. పక్కా విలన్ పాత్రలో కుష్బూ కనిపించబోతుందని టాక్ నడుస్తోంది.

అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక మోహన్ రాజా స్క్రిప్ట్ లో కూడా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :