వైరల్ పిక్స్ : చిన్నారి అభిమాని కోరిక తీర్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

Published on Feb 10, 2023 2:20 am IST

టాలీవుడ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక RC 15 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం క్యాన్సర్ తో బాధపడుతున్న తన చిన్నారి అభిమాని అయిన 9 ఏళ్ళ బాలుడిని నేడు కలిసి అతడితో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు రామ్ చరణ్. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ బాలుడి కోరికని మేక్ ఆ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న చరణ్ తన గొప్ప మనసుతో చిన్నారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక చరణ్ ఆ బాలుడిని కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :