‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ పై మెగాపవర్ స్టార్ ప్రశంసల జల్లు

Published on Sep 16, 2023 7:00 pm IST

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్స్ గా తాజాగా యువ దర్శకుడు పి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో నాజర్, జయసుధ, మురళి శర్మ, తులసి, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ అందరి నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ రాబడుతోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు దీని పై ప్రసంశలు కురిపించారు. ఇక తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ పై తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా పొగడ్తలు కురిపించారు. నేడు మూవీ చూసాను, ఎంతో బాగుంది. ముఖ్యంగా హీరో నవీన్ తన పాత్రలో పండించిన హాస్యం, హీరోయిన్ అనుష్క శెట్టి అందం, అభినయం తనకు ఎంతో బాగా నచ్చాయని, యువి క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు, ఫైనల్ గా దర్శకుడు మహేష్ ఆకట్టుకునే దర్శకత్వ ప్రతిభ తనకు ఎంతో నచ్చాయని అన్నారు. ఇంత పెద్ద విజయం అందుకున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీమ్ కి ప్రత్యేకంగా అభినందనలు అంటూ రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :