“హీరో” సినిమాపై మెగాపవర్ స్టార్ సూపర్ రెస్పాన్స్.!

Published on Jan 18, 2022 8:02 pm IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో అశోక్ గల్లా హీరోగా గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రం “హీరో” కూడా ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయ్యిన అశోక్ గల్లా తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడని చెప్పాలి. చాలా మందిలో చాలా అనుమానాలే ఉండి ఉండొచ్చు కానీ వాటిని మించి మంచి రెస్పాన్స్ హీరో సినిమాకి మరియు అశోక్ గల్లా కి దక్కాయి.

ఇక లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఈ సినిమా పై ప్రశంసల జల్లు కురిపించాడు. హీరో సినిమా చూసి చాలా చేసానని, సినిమా ప్రపంచంలోకి నీకు ఆహ్వానం చెబుతున్నామని అశోక్ గల్లాకి అభినందలు కూడా తెలిపాడు. అంతే కాకుండా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సహా చిత్ర యూనిట్ అందరికీ చరణ్ కంగ్రాట్స్ తెలిపాడు. దీనితో అశోక్ తమ సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నా చాలా థాంక్స్ అని తెలిపాడు.

సంబంధిత సమాచారం :