గ్రాండ్ గా లాంచ్ అయ్యిన మెగాస్టార్ మాస్ ప్రాజెక్ట్.!

Published on Nov 6, 2021 4:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న పలు సాలిడ్ ప్రాజెక్ట్స్ లో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఇంకో చిత్రం తన 154వ చిత్రం. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై గత రెండు మూడు రోజులు నుంచి బ్యాక్ టు బ్యాక్ మాస్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. మరి ఈరోజు ఈ సినిమాపై అంతకు మించిన క్లారిటీని చిత్ర యూనిట్ ఇచ్చారు. సినిమా నుంచి మెగాస్టార్ మాస్ లుక్ ని లాంచ్ చెయ్యడమే కాకుండా టాలీవుడ్ దిగ్గజాల సమక్షంలో ఈరోజు గ్రాండ్ గా ఈ సినిమా లాంచ్ అయ్యింది.

దర్శకులు పూరీ జగన్నాథ్, వివి వినాయక్, మెహర్ రమేష్, కొరటాల శివ, హరీష్ శంకర్ వీరందరినీ మించి దర్శకేందుడు రాఘవేంద్రరావు గారు సినిమా దర్శకుడు బాబీ, ఇంకా చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రాండ్ లాంచ్ ఇచ్చారు. చిరు చేస్తున్న ఈ సినిమాపై మాత్రం ప్రత్యేక అంచనాలు ఉన్నాయి మరి బాబీ ఏ లెవెల్లో మెగాస్టార్ ని ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More