మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రం పోస్టర్ విడుదల…పూనకాలు లోడింగ్!

Published on Aug 22, 2021 5:04 pm IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే భోళా శంకర్ మరియు గాడ్ ఫాదర్ చిత్రాల కి సంబంధించిన అప్డేట్స్ రాగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. వింటేజ్ మెగాస్టార్ బ్యాక్ అనేలా స్టిల్ ఉండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పూనకాలు లోడింగ్ అంటూ ఉండటం తో అభిమానులకి నచ్చే మాస్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :