మెగాస్టార్ 156 : ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదట

Published on Sep 20, 2023 2:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ 157 మూవీ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారీ లెవెల్లో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మించనున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందనుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. అయితే ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా మెగా 156 మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా వచ్చింది.

మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించనున్న ఈ మూవీ పోస్టర్ ఇచ్చినప్పటికీ దర్శకుడి పేరు ప్రకటించలేదు. కాగా ఈ మూవీని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ కాంబో మూవీ ఆగిపోయిందని రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. కాగా ఆ మూవీ ఆగిపోలేదని, ప్రస్తుతం దర్శకడు కళ్యాణ్ కృష్ణ కథ, స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారని, అతి త్వరలో మూవీ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్లు మేకర్స్ దీని పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :