మెగాస్టార్ 157 మూవీ లేటెస్ట్ అప్ డేట్

Published on Sep 5, 2023 8:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. దానితో తదుపరి సినిమాల పై గట్టిగా దృష్టి పెట్టిన మెగాస్టార్ ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ తో తన కెరీర్ 157వ సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కనుండగా ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ 157 టీమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉన్నారట. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ని సైతం ఎంతో ఆకట్టుకునేలా అద్భుత రీతిన దర్శకుడు వశిష్ఠ ఈ మూవీని తెరకెక్కించనున్నారట. ఇక ఈ మూవీ గురించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :