మెగా హీరో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా ‘మెగాస్టార్ చిరంజీవి’

chiranjeevi
‘గౌరవం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండవ సినిమా ‘కొత్త జంట’ తో సైతం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన మెగా హీరో ‘అల్లు శిరీష్’ తాజాగా ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో మరోసారి తెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ‘పరశురాం’ దర్శకత్వంలో ‘అల్లు అరవింద్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ఇటీవలే విడుదలకాగా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజే దర్శకుడు ‘క్రిష్’ చేతులమీదుగా రిలీజయింది.

ఇకపోతే ఆగష్టు 5న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుండగా జూలై 31న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించాలని చిత్ర టీమ్ నిర్ణయించింది. హైదరాబాద్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ‘మెగాస్టార్ చిరంజీవి’ ముఖ్య అతిథిగా రానున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శిరీష్ సరసన ‘లావణ్యా త్రిపాఠి’ హీరోయిన్ గా నటిస్తోంది.