హ్యాట్సాఫ్.. జడివానలో కూడా మెగాస్టార్ బెస్ట్ ఎవర్ స్పీచ్.!

Published on Sep 29, 2022 9:02 am IST

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ డెడికేటెడ్ ఎప్పటికప్పుడు కూడా భవిష్యత్ టాలీవుడ్ తరాలకు యువ నటులకి కూడా ఒక నిజమైన ఇన్స్పిరేషన్ గా మెగాస్టార్ చిరంజీవి నిలుస్తారో నిన్న “గాడ్ ఫాథర్” గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా మరోసారి ఋజువు అయ్యిందని చెప్పాలి. మెగాస్టార్ కి తన సినిమాల పట్ల ఎంతటి డెడికేషన్ ఉంది తన సినిమా ఆడియెన్స్ లోకి ముఖ్యంగా అభిమానులకు ఎంత దగ్గరకి చేరువ కావాలి అనే అంశంలో తాను ఎంతవరకు వెళ్తారు అనేది అందరికీ క్లియర్ అయ్యింది.

గాడ్ ఫాథర్ భారీ ఈవెంట్ కి ఎన్నో రోజులు నుంచి భారీ ప్లాన్స్ తో గ్రాండ్ ఈవెంట్ ని మేకర్స్, అభిమానులు ప్లాన్ చేసుకున్నారు. కానీ నిన్న ఆకస్మికంగా అనంతపూర్ లో జడివాన కురిసింది. ఇదే వానలో అయితే డెఫినెట్ గా మరో ఈవెంట్ చాలా త్వరగా ముగిసిపోయి ఉండేది.

అందులోని ఓ హీరో అదే వానలో తడుస్తూ 30 నిమిషాలకి పైగా అలా నిలబడే స్పీచ్ ఇవ్వడం అనేది కూడా జరగకపోవచ్చు. కానీ మెగాస్టార్ తన వయసును కూడా లెక్క చేయకుండా అంతే పెద్ద వానలో అభిమానులతో తడుస్తూ అరగంటకి పైగా తన ప్రసంగం అందించారు. ఇది మామూలు విషయం కాదని చెప్పాలి. పైగా ఏదో సాదా సీదా స్పీచ్ కూడా ఇది కాదని చెప్పాలి.

ఓ పక్క సినిమాలో నటీ నటుల్ని పేరు పేరున చెబుతూ మరోపక్క అభిమానులు ఎక్కడా నిరుత్సాహ పడకుండా పవర్ఫుల్ గా దేన్నీ లెక్క చెయ్యకుండా మెగాస్టార్ మాట్లాడారు ఈ సమయంలో తాను చూపించిన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి. అలాగే ఇది మాత్రం డెఫినెట్ గా తాను కం బ్యాక్ ఇచ్చాక బెస్ట్ ఎవర్ స్పీచ్ అని చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం :