ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మెగాస్టార్ ‘భోళా శంకర్’

Published on Sep 15, 2023 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన మూవీ భోళా శంకర్. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా మెగాస్టార్ కి చెల్లెలిగా కీలక పాత్రలో కీర్తి సురేష్ నటించారు. అయితే అందరిలో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన భోళా శంకర్ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మించారు.

అయితే మ్యాటర్ ఏమిటంటే, నేడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. అజిత్ నటించిన తమిళ మూవీ వేదాళం కి రీమేక్ గా రూపొందిన భోళా శంకర్ థియేటర్స్ లో ఫెయిల్ అవగా, ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇంకా ఈ మూవీలో సుశాంత్, మురళీశర్మ, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, షాయాజీ షిండే, రవి శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు.

సంబంధిత సమాచారం :