“భోళాశంకర్” అప్డేట్.. మెగాస్టార్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్..!

Published on Jun 20, 2022 11:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే నలభై శాతం పూర్తి అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి ‘ఆచార్య’ రిలీజ్, ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో ‘భోళా శంకర్’ సినిమాకి కాస్త బ్రేక్ వచ్చింది.

అయితే ఈ సినిమా షూటింగ్‌ను రేపటి నుంచి తిరిగి ప్రారంభించబోతున్నట్టు దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపాడు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో మెగాస్టార్ చిరంజీవిపై స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారని, రామ్, లక్ష్మణ్‌లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. చిరుకి చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతీ స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :