లేటెస్ట్..గ్రాండ్ గా లాంచ్ అయ్యిన చిరు “భోళా శంకర్”.!

Published on Nov 11, 2021 9:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు భారీ సినిమాలతో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే తన 154వ సినిమా పై క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన చిరు ఇప్పుడు దానికి ముందు కంప్లీట్ చెయ్యాల్సి ఉన్న సినిమా “భోళా శంకర్”. దర్శకుడు మెహర్ రమేష్ కాంబోలో ప్లాన్ చేసిన ఈ చిత్రం తమిళ్ సూపర్ హిట్ వేదాళం కి రీమేక్ గా తెరకెక్కనుంది.

మరి చిత్ర యూనిట్ మొదటి నుంచీ చెబుతున్న ఈ నవంబర్ 11న ఉదయం 7 గంటల 45 నిమిషాలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో ముహూర్తం కంప్లీట్ చేశారు. మెగాస్టార్ తో వర్క్ చేసిన, ఇంకా చెయ్యాల్సి ఉన్న యంగ్ దర్శకులు మిల్కీ బ్యూటీ తమన్నాతో ఈ సినిమా లాంచ్ స్టార్ట్ అయ్యింది. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీద క్లాప్ కొట్టడంతో సినిమా స్టార్ట్ అయ్యింది. మరి అలాగే ఈ కార్యక్రమంలో నిర్మాత అనీల్ సుంకర సహా ఇతర ప్రముఖ నిర్మాతలు కూడా పాల్గొనడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More