మెగాస్టార్ ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ టీజర్ అప్పుడేనా … ??

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ టీజర్ అప్పుడేనా … ??

Published on Jun 29, 2022 3:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతోన్న సినిమా భోళా శంకర్. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల మహాశివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

తమిళ్ లో అజితే హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన వేదాళం కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్, సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగె యాక్షన్ కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఆ రోజున పక్కాగా టీజర్ రావడం ఖాయం అని టాక్. అదే నిజం అయితే మెగాస్టార్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు