వావ్ : మెగాస్టార్ బర్త్ డే నాడు మెగా కార్నివాల్ …!

వావ్ : మెగాస్టార్ బర్త్ డే నాడు మెగా కార్నివాల్ …!

Published on Aug 19, 2022 12:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఆగష్టు 21న ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో ఒకటైన గాడ్ ఫాదర్ నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కానుండగా తెల్లారి 22 న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇతర సినిమాల నుండి కూడా సర్ప్రైజింగ్ అప్ డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆయన బర్త్ డే రోజున హైదరాబాద్ లోని హైటెక్స్ లో మెగా ఫ్యాన్స్ కోసం మెగాకార్నివాల్ పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు. దీని గురించి మాట్లాడిన మెగాబ్రదర్ నాగబాబు, ఈ విధంగా ఒక హీరో అభిమానుల కోసం కార్నివాల్ చేయడం ఫస్ట్ టైం అని, తమ ఫ్యామిలీ హీరోలతో పాటు పలు ఇతర సినిమా ప్రముఖులు, నటులు ఈ ఈవెంట్ కి హాజరవుతారని, అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రావడం లేదని తెలిపారు. మొత్తంగా ఈ బర్త్ డే నాడు మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ఐ ఫీస్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు