గెటప్ శ్రీను ఫ్యామిలీకి మెగాస్టార్ బ్లెస్సింగ్స్ గిఫ్ట్.!

Published on Oct 23, 2021 7:30 pm IST


మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది యువ నటులకు ఆదర్శం అని అందరికీ తెలిసిందే. తనని చూసి ప్రేరణ చెంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యిన వాళ్ళు కూడా కోకొల్లలు. అలాంటి వారిలో ‘జబర్దస్త్’ ఫేమ్ గెటప్ శ్రీను కూడా ఒకరు. ఈటీవీ షో ద్వారా మంచు పాపులారిటీ తెచ్చుకొని చిరు మన్ననలు పొంది తన తోనే సినిమాలో స్క్రీన్ షేర్ పంచుకునే దిశగా కష్టపడ్డాడు. అక్కడ నుంచి శ్రీను కు చిరు మరింత దగ్గరయ్యారు.

అయితే శ్రీనుకి కానీ తన కుటుంబానికి కానీ చిరు ఎంత సాన్నిహిత్యులో అనేదానికి చిన్న శాంపిల్ తెలుస్తుంది. ఈరోజు గెటప్ శ్రీను వివాహ దినోత్సవం కావడంతో వారికి చిరు కేకు, స్వీట్లు సహా బహుమతులతో అన్నిటికీ మించి తన ఆశీర్వాదాలు అందించారు. దీనితో శ్రీను ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా ఈ పెళ్లి యానివర్సరీ కి గుర్తుండిపోయే బహుమానం ఇచ్చారని చిరుకి తన ఆనందపు ధన్యవాదాలు తెలిపాడు.

సంబంధిత సమాచారం :