బర్త్‌డే బ్లాస్ట్: “గాడ్ ఫాదర్‌గా” మెగస్టార్ చిరంజీవి..!

Published on Aug 21, 2021 7:43 pm IST

మెగస్టార్ చిరంజీవి రేపటితో 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా మోహన్ రాజా దర్శకత్వంలో మళయాళంలో సూపర్ హిట్టైన “లూసిఫర్” రీమేక్‌కి సంబంధించి తాజాగా ప్రీలుక్‌తో పాటు, టైటిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాకు ముందుగా ప్రచారంలో ఉన్నట్లుగానే “గాడ్‌ ఫాదర్” అనే టైటిల్‌నే ఖరారు చేశారు. ఇక లుక్ విషయానికి వస్తే బ్లాక్‌ క్యాప్‌ పెట్టుకొని, చేతిలో గన్‌తో స్టైల్‌గా నిల్చొని ఉన్న చిరు లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్ష్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే చిరు హీరోగా నటిస్తున్న మెహర్‌ రమేష్‌, బాబీ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రేపు రిలీజ్ కాబోతున్నాయి.

సంబంధిత సమాచారం :