వైరల్ : ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్, పూనకాలు లోడింగ్’ – మెగాస్టార్ అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్

వైరల్ : ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్, పూనకాలు లోడింగ్’ – మెగాస్టార్ అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్

Published on Jan 1, 2023 2:21 AM IST


టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటించిన మాస్ యాక్షన్ సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్ర చేసిన ఈ మూవీలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా యువ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. ఇక వాల్తేరు వీరయ్య మూవీకి మెగాస్టార్ వీరాభిమాని కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించగా ఆర్ధర్ ఏ విల్సన్ ఫోటోగ్రఫి అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన వాల్తేరు వీరయ్య నుండి ఇప్పటికే విడుదలైన నాలుగు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి.

ఇక ఈ మూవీ నుండి నిన్న రిలీజ్ అయిన మెగాస్టార్, మాస్ రాజా ల మాస్ సాంగ్ పూనకాలు లోడింగ్ సాంగ్ అందరి నుండి సెన్సేషనల్ రెస్సాన్స్ ని సొంతం చేసుకుంటూ యూట్యూబ్ లో దూసుకెళుతోంది. విషయం ఏమిటంటే, మరికొద్దిసేపటిలో రానున్న న్యూ ఇయర్ కి ముందుగానే వెల్కమ్ చెపుతూ, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ గుడ్ బై 2022, పూనకాలు లోడింగ్ వెల్కమ్ 2023, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకాభిమానులు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూస్ చెప్తూ పెట్టిన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు