ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన మెగాస్టార్..!

Published on Dec 7, 2021 2:30 am IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వయసు పెరుగుతున్నా కూడా ఆయనలో జోష్ మాత్రం తగ్గడం లేదు. ఈ డిసెంబర్‌లో ఏకంగా నాలుగు సినిమాల షూటింగ్‌లు చేస్తూ, ఒకే నెలలో అత్యధిక సినిమాలు చేసిన స్టార్ హీరోగా చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం “ఆచార్య” ఇప్పటికే షూటింగ్‌ని పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా తరువాత 153వ సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ “గాడ్ ఫాదర్”. 154వ సినిమాని యంగ్ డైరెక్టర్ బాబీతో చేస్తున్నాడు. ఇక 154వ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నాడు. ఈ డిసెంబర్‌లోనే ఈ నాలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రపంచంలో ఒకే నెలలో అత్యధిక షూటింగ్‌లు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారు.

సంబంధిత సమాచారం :