మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఇది రానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ అందుతోంది. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.
లైలా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి రానున్నారని విశ్వక్ తెలిపారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక విశ్వక్ కోసం చిరు వస్తుండటంతో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.