మహేష్ పై మెగాస్టార్ అద్భుతమైన విషెష్.!

Published on Aug 9, 2022 10:54 am IST


ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో మహేష్ కి అభిమానులు సహా సినిమా సినీ ప్రముఖులు ఎందరో తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుండగా మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా సూపర్ స్టార్ మహేష్ కి తన అద్భుతమైన విషెష్ ని తెలియజేయడం ఆసక్తిగా మారింది.

“ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని” చిరు తాను కలిసి ఉన్న ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసుకొని తెలియజేయగా మహేష్ మరియు మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

సంబంధిత సమాచారం :